Site icon NTV Telugu

Maharashtra: మంత్రి పంకజ ముండేకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా..!

Pankaja Munde

Pankaja Munde

దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం మరువక ముందే.. మరో మంత్రి పంకజ ముండేకు హెలికాప్టర్‌ ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. టేకాఫ్ నిలిపివేశారు. దీంతో మంత్రితో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే ఛత్రపతి శంభాజీనగర్ నుంచి లాతూర్‌కు హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్ టేకాఫ్ అవ్వకుండా నిలిపివేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం పంకజ ముండే సంభాజీనగర్ నుంచి లాతూర్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. అయితే పైలట్ సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ నిలిపివేశారు. దీంతో మంత్రి లాతూర్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: వారం వ్యవధిలో మోడీ రెండు బిగ్ డీల్స్.. భారత్‌కు కలిసొచ్చేదెంత?

ఇటీవల అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి విమానంలో బయల్దేరారు. బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా విజిబులిటీ కారణంగా తప్పుగా ల్యాండింగ్ అవ్వడంతో విమానం పేలి పోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడి అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అజిత్ పవార్ విమాన ప్రమాద దర్యాప్తులో అనేక లోపాలను అధికారులు గుర్తించారు. బారామతి ఎయిర్‌స్ట్రిప్‌లో రన్‌వే మార్కర్లు లేకపోవడం, నావిగేషనల్ సహాయాలు లేకపోవడం, అత్యవసర సహాయం లేకపోవడం వంటి అనేక లోపాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి.

Exit mobile version