Site icon NTV Telugu

Teacher: “నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు”.. ఏకలవ్యుడిని ఉదహరిస్తూ, విద్యార్థినికి టీచర్ వేధింపులు..

Teacher

Teacher

Teacher: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినిని తన ‘‘గర్ల్‌ఫ్రెండ్’’గా ఉండాలని కోరాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. తన గురుదక్షిణ కింద గర్ల్ ఫ్రెండ్‌గా మారమని కోరడం పెద్ద వివాదానికి దారి తీసింది. బాలిక పాఠశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. పాఠశాల అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు సదరు ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కిసాన్‌గంజ్ జిల్లాలోని కిసాన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు వికాస్ కుమార్ 12వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఫోన్ చేసి పలుసార్లు వేధించాడు. ఇద్దరం కలిసి సిలిగురి వెళ్తామని ప్రపోజ్ చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించారని అమ్మాయి ఆరోపించింది. మహాభారతంలో ఎకలవ్యుడని ఉదాహరణగా తీసుకుని ద్రోణాచార్యుడిగా గురువుగా భావించి, గురుదక్షిణగా కుడి చేతి బొటనవేటు కోసి ఇచ్చాడని, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి ఎందుకు కాలేకపోతున్నావు అని ఉపాధ్యాయుడు ప్రశ్నించాడని విద్యార్థిన ఆరోపించింది.

Read Also: NABARD State Focus Paper: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల

దీనిపై బాలిక తన ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, పాఠశాలలో అతడిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. గతంలో స్కూల్ లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలికి ఇలాగే ప్రపోజ్ చేసినట్లు తెలిసింది, ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రిన్సిపాల్ షఫీక్ అహ్మద్ ఈ విషయంపై జిల్లా విద్యా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ విద్యాశాఖ నిందితుడైన ఉపాధ్యాయుడు వికార్ కుమార్ నుంచి వివరణ కోరడం తప్పా, మరే చర్య తీసుకోలేదు.

ఆ టీచర్ ఇంకా సమాధానం ఇవ్వలేదు, కిషన్ గంజ్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్నాడు. తనపై వచ్చిన ఆరోపణపై ఉపాధ్యాయుడు స్పందించేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు పాఠశాల ముందు ధర్నా చేశారు. పోలీసులు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని, విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Exit mobile version