Site icon NTV Telugu

Journey: 82 రోజుల్లో 2,500 కిలోమీట‌ర్ల పాదయాత్ర..

Milan Majhi

Milan Majhi

అందరికీ ఏవో కలలు ఉంటాయి.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి బైక్‌పై లడఖ్‌ వరకు బైక్‌పై వెళ్లాలనేది డ్రీమ్‌.. అయితే, అతడు అమ్మేది టీ.. బైక్‌ కొనే ఆర్థిక శక్తి అతడికి లేదు.. అయినా పట్టు వదలలేదు.. వెనక్కి తగ్గలేదు.. లడఖ్‌కు కాలి నడకన చేరుకుని ఔరా..! అనిపించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా సమీపంలోని హుగ్లీ జిల్లాకు చెందిన మిలన్ మాఝీ అనే టీ అమ్మే వ్యక్తి కోల్‌కతా నుండి లడఖ్‌కు కాలినడకన చేరుకున్నాడు.. బైక్‌పై లడఖ్‌కు ప్రయాణించాలనే అతని చిరకాల కల నెరవేరకపోవంతో.. అతడి కోరికను చంపుకోలేక.. కాలినడకనే బయల్దేరాడు.. మిలన్ ఫిబ్రవరి 22న హౌరా వంతెన నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, మే 15వ తేదీన లడఖ్‌లోని ఖర్దుంగ్లా పాస్‌కి చేరుకున్నాడు..

Read Also: Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ..

హౌరా నుంచి లడఖ్ మధ్య దూరం దాదాపు 2500 కిలోమీటర్లు కాగా.. రోజుకు దాదాపు 30 కిలోమీటర్ల చొప్పున కాలినడకన తన ప్రయాణాన్ని సాగించాడు మిలన్‌.. 100 రోజులలోపు ప్రయాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.. కానీ, 82 రోజుల్లోనే తన లక్ష్యాన్ని అందుకున్నాడు.. తన సాహ‌స యాత్రను పూర్తిచేశాడు. ఇక, మిల‌న్‌కు ప‌లు స్వచ్ఛంద సంస్ధలు, సేవా సంస్ధలు స‌హ‌క‌రించాయి. మిల‌న్ యాత్ర గురించి తెలుసుకున్న ప‌లువురు అత‌డికి అవ‌స‌ర‌మైన వ‌స‌తి, భోజ‌న ఏర్పాట్లు చేశారు.. త‌న కుమారుడు ల‌డ‌ఖ్ కాలిన‌డ‌క‌న వెళ‌తాడ‌ని త‌న‌కు తెలియ‌ద‌ని మిల‌న్ తండ్రి అనిల్ మాఝీ అన్నారు.. మొత్తంగా.. హౌరా నుంచి జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్రదేశ్ మీదుగా ల‌డ‌ఖ్ చేరుకున్నాన‌ని మిల‌న్ త‌న యాత్ర పూర్తిచేసిన సందర్భంగా వెల్లడించారు.. తాను కేవ‌లం 2,100 రూపాయలతో ఇంటి నుంచి బయల్దేరాను.. మందులు, స్వెట్టర్ల వంటివి కొనుగోలు చేశాన‌ని.. మార్గం మధ్యలో తనకు చాలా మంది భోజనం అందించారు.. తిండికి లోటు లేదని చెప్పుకొచ్చాడు.

Exit mobile version