NTV Telugu Site icon

Taslima Nasreen: భారతదేశంలో హిందువులు కూడా సురక్షితంగా లేరు.

Udaipur

Udaipur

రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అత్యంత పాశవికంగా ఇద్దరు మతోన్మాదులు హత్య చేయడాన్ని యావత్ దేశం ఖండిస్తోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్శ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే కారణంతో మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్ అనే ఇద్దరు దుండగులు గొంతు కోసి తలవేరు చేసి చంపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై ప్రముఖులతో పాటు మత సంస్థలకు కూడా స్పందిస్తున్నాయి. ముస్లిం మత సంస్థలు, నాయకులు ఈ హత్యను ఖండించారు. కంగనా రనౌత్, బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ ఈ దుర్మార్గపు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తస్లిమా ట్విట్టర్ లో స్పందించారు. ‘‘ మతోన్మాదులతో చాలా ప్రమాదం. హిందువులు భారత్ లో సురక్షితంగా లేరు. గియాజ్, రియాజ్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను దారుణంగా చంపి వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. వారు ప్రవక్త కోసం ఏదైనా చేయగలరు’’ అంటూ ట్వీట్ చేశారు.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ హత్యపై స్పందించారు. ఈ వీడియో చూసే ధైర్యం నాకు లేదని.. మొద్దుబారిపోయానని ట్వీట్ చేశారు. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచిన కన్హయ్య అనే వ్యక్తి తలనరికి, జీహాదీలు వీడియో తీశారని ట్వీట్ చేసింది.

కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ఖతార్ హిందువలందరికీ  అధికారికంగా క్షమాపణలు చెప్పే సమయం ఆసన్నమైందని.. నిజమైన హిందువుగా ఉండి, హిందూ-స్థాన్ లో మనుగడ సాగించడం అసాధ్యమని.. బతకాలంటే అర్బన్ నక్సల్ గా మారడం, లేదా అనామకంగా మారడం.. లేదా చనిపోవడం. రలీవ్, గాలివ్, చలీవ్’’ అంటూ ట్వీట్ చేశారు. స్వరాభాస్కర్, అనుపమ్ ఖేర్, రిచా చద్ధా వంటి వారు కూడా ఈ ఘటనపై స్పందించారు.