Site icon NTV Telugu

Tarun Chugh: జిన్నా చేసిందే, ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తుంది..

Mamata Banerjee

Mamata Banerjee

Tarun Chugh: బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక అల్లర్లపై మమతా బెనర్జీ ఏం చేయడం లేదని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. హింసకు మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తోంది. బెంగాల్‌లో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరిగిన వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింస చోటు చేసుకుంది. ఈ అల్లర్ల లో ఇప్పటికే ముగ్గురు మరణించారు. అల్లర్లకు పాల్పడిన వారిలో 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, కలకత్తా హైకోర్టు ప్రభుత్వం తీరును తీవ్రంగా ఆక్షేపించింది, కళ్లు మూసుకుని ఉండలేమని, హింస తీవ్రంగా ఉన్న జంగీపూర్ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Old City Metro : ఓల్డ్‌ సిటీలో మెట్రో కారిడార్‌లో జోరు.. స్థల సేకరణ పనులు ముమ్మరం

ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నేత తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జిన్నా చేస్తున్నది ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తుంది. నేడు ఆమె ఇమేజ్ జిన్నాకు సమానంగా ఉంది. ఆమె పార్టీ ముస్లిం లీగ్ చేసిన పనినే చేస్తోంది. నేడు జరుగుతున్న సంఘటనలు 1940లో ముస్లింలీగ్ చర్యల లాంటివి. అయినప్పటికీ, అధికారంలో ఉన్న వ్యక్తులు తమ కళ్లకు గంతలు కట్టుకున్నారు. ముర్షిదాబాద్ లో వక్ఫ్ హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించిన తర్వాత కూడా మమతా బెనర్జీ రహస్యంగా మౌనం వహించడం సిగ్గుచేటు, తీవ్రంగా ఖండించదగింది, బాధకరమైనవి. మైనారిటీ సంతృప్తి పేరుతో మమతా ప్రభుత్వం హిందువుల భద్రతపై నిరంతరం రాజీ పడుతోంది.’’ అని తరుణ్ చుగ్ అన్నారు.

Exit mobile version