Site icon NTV Telugu

Tara Shahdeo: షూటర్ తారా “లవ్ జిహాద్” కేసు.. మాజీ భర్తకు జీవిత ఖైదు

Tara Shahdeo

Tara Shahdeo

Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది. తారా సహదేవ్ మాజీ భర్త రకీబుల్‌కు జీవిత ఖైదు విధించిడంతో పాటు అతడి తల్లి కౌసర్ రాణికి పదేళ్లు జైలు శిక్ష, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. దీంతో పాటు నిందితులకు రూ. 50,000 జరిమానా విధించింది.

ఈ కేసులో తీర్పుపై తారా ఆనందం వ్యక్తం చేశారు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ న్యాయం తనకు మాత్రమే కాదని తనలా బాధించబడుతున్న మహిళలకు ముందడుగు అని ఆమె అన్నారు. ప్రతీ మహిళలో విశ్వాసాన్ని నింపుతుందని, నాలాంటి అమ్మాయిలు అన్యాయాలపై ఎదురించి పోరాడేందుకు సహాయపడుతుందని ఆమె అన్నారు.

Read Also:Ukraine War: ఉక్రెయిన్ సూపర్ మార్కెట్‌పై రష్యా దాడి.. 49 మంది మృతి

కేసు వివరాలు ఇవే:

జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్‌ని రకీబుల్ అనే వ్యక్తి రంజిత్ కోహ్లీగా పేరు మార్చుకుని ప్రేమ పేరుతో వంచించి 2014లో వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తారా సహదేవ్ కి తెలిసింది. అప్పటి నుంచి ఆమె భర్త రకీబుల్ హసన్ తో పాటు ఆమె తల్లి కౌసర్ రాని మతం మార్చుకోవాని ఆమెపై ఒత్తడి తెచ్చారు. హింసకు గురిచేశారు.

నేరపూరిత కుట్రతో పాటు, పదే పదే అత్యాచారం చేసేందుకు కుట్ర, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై హింద్‌పిరి పోలీస్ స్టేషన్ లో తార ఫిర్యాదు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ముగ్గురు నిందితులు తారా సహదేవ్ ని మోసం చేశారు.

నిందితులు తారని మానసికంగా, శారీరకంగా ఇస్లాంలోకి మారాలని వేధించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు 2015లో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ కేసు ‘లవ్ జిహాద్’ కేసుగా ఆరోపించబడింది. దాదాపుగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి పీకే శర్మ గత వారం ముగ్గురిని దోషులుగా తేల్చారు. తాజాగా ఈ రోజు శిక్షను విధించారు. 2018లో రాంచీ ఫ్యామిలీ కోర్టు తారకు విడాకులు మంజూరు చేసింది.

Exit mobile version