NTV Telugu Site icon

Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..

Odisha

Odisha

Odisha: ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో తాంత్రికుడు మహిళ తలలో 18 సూదులను పొడిచాడు. రాష్ట్రంలో బలంగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాంత్రికుడు 19 ఏళ్ల యువతి తలలో సూదులను గుచ్చడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ నిర్వహించగా, ఆమె తలలో 10 సూదులను గుర్తించారు. ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Olympic Medals: ఒలింపిక్స్‭లో అందించే బంగారు పతకంలో ఎంత బంగారముంటుందో తెలుసా..?

వివరాల్లోకి వెళితే.. యువతి గత నాలుగేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమె పరిస్థితి నయం కాలేదు. ఈ నేపథ్యంలో తనకు ఆరోగ్యం నయం కావాలని తల్లిదండ్రులతో కలిసి ఓ తాంత్రికుడిని సంప్రదించింది. వైద్యం పేరుతో ఒక గదిలోకి యువతిని తీసుకెళ్లిన తాంత్రికుడు సంతోష్ రానా, గంట తర్వాత ఆమెను బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆమె అసౌకర్యంగా ఉండటం చూసిన తల్లిదండ్రులు ఆమె తలలో సూదులను గుర్తించారు. దీంతో బాధితురాలి తండ్రి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సీటీ స్కాన్‌లో 10 సూదులు తలలో ఉన్నట్లు తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాంత్రికుడిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ చేస్తున్నారు.

Show comments