NTV Telugu Site icon

Tamota : సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం టమాటా అమ్మకాలు.. కిలో ఎంతో తెలుసా?

Whatsapp Image 2023 07 15 At 4.28.37 Pm

Whatsapp Image 2023 07 15 At 4.28.37 Pm

టమోటాల ధరలు దాదాపు డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉన్నాయి.. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా ధరలు డబుల్ అవుతున్నాయి.. ఒకప్పుడు రూ.10 పలికిన కిలో టమోటా ఇప్పుడు కిలో రూ.160 నుంచి రూ.200ల వరకు అమ్ముతున్నాయి.. పెరిగిన ధరల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జనాలకు సబ్సిటీతో టమాటాలుఅమ్మాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం టమాటా పంటల ఉత్పత్తిలో 56-58 శాతం దక్షిణ, పశ్చిమ భారత్ నుంచే జరుగుతోంది. దీంతో కేంద్రం ఎక్కువ టమాటాల ఉత్పత్తి ప్రాంతాల్లో టమాటాలు కొని దేశంలో ఎక్కువ ధరలు అమ్మే రాష్ట్రాల్లో ప్రజలకు సబ్సిటీ ద్వారా అమ్మేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం ఇప్పటికే టమాటాలను కొన్న టమాటాలు ఢిల్లీకి చేరుకోగా వాటిని పలు రాష్ట్రాలకు తరలించాయి.. అక్కడ సబ్సిడీ తో టమోటా విక్రయాలను కొనసాగిస్తున్నారు..

టమోటాలను కొని పెద్దగా పండించే ప్రాంతాల నుంచి కిలో రూ.90 కు ఒక్కో వ్యక్తికి రెండు కిలోల చొప్పున రాయితీపై అందిస్తోంది. తాజాగా సేకరించిన టమాటాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల,నుంచి ఢిల్లీ మార్కెట్లకు పెద్ద మొత్తంలో టమాటాలు చేరుకున్నాయి. కాగా అధికారులు టమాటాలో శుక్రవారం నుంచి మార్కెట్ లలోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.. నోయిడాలోని రజినీ గంథ్ చౌక్ లోని కార్యాలయం వద్ద, గ్రేటర్ నోయిడా, ఇతర ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్లలో టమాటాలను అమ్మకానికి పెట్టారు. అదే విధంగా లక్నో,కాన్పూర్, జైపూర్ వంటి నగరాల్లో కూడా టమాటాలను అమ్మనున్నారు.

ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 20 మొబైల్ వ్యాన్లలో ఐదు కేంద్రాల్లో సబ్సిటీలపై టమాటాల విక్రయం ఈరోజు ప్రారంభించారు అధికారులు.. ప్రజలు ఇబ్బందులు పడకుండా సమన్వయం పాటించాలని అధికారులు తెలుపుతున్నారు.. ఉత్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ – నాఫెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కిలో టమాటా రూ. 150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.250 కి కూడా అమ్మతున్న పరిస్థితి ఉంది. దాంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి.. పంటను కొని ధరలబ్ రాష్ట్రాల్లో తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది… టమోటా ధరలకు ఎప్పుడు తగ్గిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..