NTV Telugu Site icon

Vani Jayaram: ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!

Vani Jayaram Forensic

Vani Jayaram Forensic

Tamilnadu Police Gives Clearance On Vani Jayaram Death: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో.. ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తిన విషయం తెలిసిందే! దీంతో ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు రావడంతో.. ఆమె తలపై గాయాలవ్వడానికి గల కారణాలేంటో బహిర్గతమైంది. బెడ్రూంలో ఆమె కిందపడటంతో తలకు బలమైన దెబ్బ తగిలిందని, దాంతో ఆమె మృతి చెందిందని ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను తాము క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో.. వాణీ మృతిపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.

Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్

కాగా.. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టిన ఆమె.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్న వాణీ.. తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం. మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది. అయితే.. ఆ పురస్కారాన్ని అందుకోకుండానే కన్నుమూశారు. వాణీ జయరాం 1968 ఫిబ్రవరి 4వ తేదీన జయరాంను వివాహం చేసుకున్నారు. సరిగ్గా అదే రోజు ఆమె మృతి చెందారు. వాణీ భర్త జయరాం 2018లోనే కన్నుమూశారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వాణీ జయరాం ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు.

Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆమె అంతిమయాత్రలో అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం చోటు చేసుకోకుండా ఉండేందుకు, నగర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఆమెకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు.

Jr NTR: అమిగోస్ ఈవెంట్ సాక్షిగా.. ఫ్యాన్స్‌కి క్లాస్ పీకిన ఎన్టీఆర్

Show comments