NTV Telugu Site icon

Tamilnadu: ఆర్ఎస్ఎస్ నేతలపై కొనసాగుతున్న దాడులు.. పీఎఫ్ఐ అరెస్టుల నేపథ్యంలో ఘటనలు

Bomb Attacks In Tamilnadu

Bomb Attacks In Tamilnadu

Petrol bomb attack on RSS leader’s house in tamilnadu: తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నాయకులు ఇళ్లపై వరసగా దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మధురైలో మరోదాడి జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై మూడు పెట్రోల్ బాంబులు విసిరారు దుండగులు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు సెర్చ్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అసిస్టెంట్ కమిషనరల్ షణ్ముగం తెలిపారు.

ఈ ఘటనపై ఆర్ఎస్ఎస్ సభ్యుడు కృష్ణన్ స్పందించారు. నేను గత 45 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నానని.. దుండగులు బాంబులు విసిరి నా కారుకు నిప్పు అంటించారు. 20 మందికి పైగా ఆర్ఎస్ఎస్ నాయకుల ఇళ్లపై ఇలాగే దాడులు చేశారని.. వీటన్నింటి మీద ఫిర్యాదు చేశామని అన్నారు. ఇటీవల బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో తమిళనాడు బీజేపీ కేంద్రహోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. డీఎంకే, అన్నాడీఎంకే ఇతర పార్టీలు ఈ ఘటనలపై స్పందించం లేదు. వారి హిందువుల ఓట్లు మాత్రమే కావాలని ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also: Karnataka: గంజాయి స్మగ్లర్ల దాడి.. చావుబతుకుల మధ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్

ఈ ఘటనలకు ముందు చెన్నైలోని తాంబరంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ ఇంటిపై కూడా ఇలాగే దాడి చేశారు. కోయంబత్తూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమిళనాడులో కనియముత్తూర్ బీజేపీ కార్యకర్త శరత్ నివాసంపై శుక్రవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. గురువారం కోయంబత్తూర్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై కూడా పెట్రోల్ బాంబు దాడులు చేశారు దుండగులు.

ఇటీవల ఉగ్రవాద సంబంధాలపై కేంద్ర ఏజెన్సీలు ఈడీ, ఎన్ఐఏ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)పై దేశవ్యాప్తంగా భారీ దాడులు చేసింది. మొత్తం 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తనలు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కేరళ, తమిళనాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. కేరళలో శుక్రవారం జరిగిన హర్తాళ్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక తమిళనాడులో దుండగులు పెట్రోల్ బాంబుల దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు మా కార్యకర్తల బలాన్ని మరింతగా పెంచుతాయని ఆయన ట్వీట్ చేశారు.