Site icon NTV Telugu

Teacher On Flag Hoisting: జెండా వందనం చేయను.. చేస్తే నా మతం ఒప్పుకోదు

Teacher Controversy

Teacher Controversy

Teacher On Flag Hoisting: స్వాతంత్ర దినోత్సవం రోజు మతాలకతీతంగా, కులాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ జెండా వందనం చేస్తారు. మేరా భారత్ మహాన్ అంటూ గర్వం వ్యక్తం చేస్తారు. అయితే ఓ మహిళ మాత్రం తాను జెండా వందనం చేసేది లేదంటూ తెగేసి చెప్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఓ పాఠశాలలో తమిళసెల్వి అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పంద్రాగస్టు రోజు స్కూల్‌కు హాజరుకావాల్సిన ఆమె సెలవు పెట్టి గైర్హాజరు అయ్యారు. అయితే ఆమె తాను సెలవు పెట్టడానికి గల కారణంపై తోటి టీచర్లకు ఓ వీడియో సందేశం పంపించారు. తాను క్రిస్టియ‌న్‌ను అ ని, దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ వంద‌నం చేయ‌డానికి త‌మ మ‌తం ఒప్పుకోద‌ని సదరు వీడియోలో తమిళసెల్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read Also: బీపీ ఉన్న వాళ్లు ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే..

తాము విశ్వసించే దేవుడికి తప్ప మరెవరికీ నమస్కరించేది లేదని.. త‌న‌కు బ‌దులుగా అసిస్టెంట్ హెడ్‌మాస్టర్‌తో జెండా ఆవిష్కరణ చేయించాల‌ని వీడియోలో తోటి టీచర్లకు తమిళ సెల్వి సూచించారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు తమిళ సెల్వి వివరణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను మత విశ్వాసాలను పూర్తిగా అనురిస్తానని తమిళ సెల్వి వివరించారు. తనకు జాతీయ పతాకంపై గౌరవం ఉందని.. కానీ తన మతం చెప్పిందే అనుసరిస్తున్నానని తెలిపారు. తనకు జాతీయ జెండాను అవమానించే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నారు. ఈ ఏడాది త‌మిళ‌సెల్వి రిటైర్ అవుతున్నారు. ఆమె రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం నుండి పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వయోపరిమితిని 60 సంవత్సరాలకు పొడిగించడంతో ఆమె ఈ సంవత్సరం పదవీ విరమణ చేయనున్నారు. కాగా గ‌తంలో జెండా వంద‌నం చేయాల్సిన రోజుల్లో కూడా త‌మిళ‌సెల్వి సెలవు పెట్టేవార‌ని స్కూల్ స్టాఫ్ వివరించారు.

Exit mobile version