MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం ఉందని అన్నారు. గతంలో కూడా స్టాలిన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గతంలో స్టాలిన్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రజలు ‘‘16 మంది పిల్లలను’’ పెంచడం గురించి ఆలోచించేలా చేస్తోందని, 16 రకాల సంపదలపై తమిళ సామెతను ఉదహరిస్తూ అన్నారు.
Read Also: Donald Trump: హసీనాను దించేందుకు అమెరికా నిధులు.? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఆదివారం, కొళత్తూరు నియోజకవర్గంలో జరిగిన వివాహా కార్యక్రమానికి హాజరైన స్టాలిన్, కొత్తగా పెళ్లయిన జంటలు తమ పిల్లలకు సరైన తమిళ పేర్లు పెట్టాలని కోరారు. తాము కుటుంబ నియంత్రణను నిరంతరం సరిగా పాటించడం వల్ల, డీలిమిటేషన్‌లో భాగంగా పార్లమెంటరీ సీట్ల సంఖ్య తగ్గే పరిస్థితి ఉందని స్టాలిన్ చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో 39 లోక్‌సభ ఎంపీ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్‌లో ఈ సంఖ్యని తగ్గించడాన్ని డీఎంకే వ్యతిరేకిస్తోంది.