NTV Telugu Site icon

Jallikattu: తమిళనాడులోని అవనియపురంలో ప్రారంభమైన జల్లికట్టు..

Jallikattu

Jallikattu

Jallikattu: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల అవనియాపురంలో పొంగల్ పండుగ సందర్భంగా ‘జల్లికట్టు’ ప్రారంభమైంది. ఈ జల్లికట్టు పోటీలో 1,100 ఎద్దులతో పాటు 900 మంది యువకులు పాల్గొంటున్నారు. అయితే, ఈ పోటీలో మొదటి ఫ్రైజ్ గెలిచిన ఎద్దు యజమానికి ట్రాక్టర్, ఎద్దును అదుపు చేసిన వ్యక్తికి రూ.8 లక్షల విలువైన కారు అందజేయనున్నారు. ఇక, వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ పోటీలో బహుళ రౌండ్‌ల బుల్ రన్ ఉంటుంది.. ప్రతి రౌండ్‌లో 50 మంది ఎద్దుతో కుస్తీ పట్టనున్నారు. పోటీ ప్రారంభం కావడానికి ముందు, అధికారులు ఎద్దులతో పాటు యువకులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read Also: Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

అయితే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అవనియాపురం జల్లికట్టు పొంగల్ రోజున జరిగే మొదటి ప్రధాన కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక, రేపు (జనవరి 15) పాలమేడులో, జనవరి 16న అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలను నిర్వహించనున్నారు. కాగా, జల్లికట్టు అనేది ఉత్సాహభరితమైన ఆట.. యువకులు ఒకరి తర్వాత ఒకరు ఎద్దు మూపురం పట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.. వారు ఆ ఎద్దును ఆపగలిగేంత వరకు అలాగే ఉంటారు.

Show comments