Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్
- రెండు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ జాతర
- తండోపతండాలుగా తరలివచ్చి ఓటేస్తున్న ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ జాతర నడుస్తోంది. ఓటర్లు తండోపతండాలుగా తరలిస్తున్నారు. పోలింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటలకు తమిళనాడులో 37.56 శాతం పోలింగ్ నమోదు కాగా.. బెంగాల్ మొదటి దశలో 41.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఇరు రాష్ట్రాల్లో భారీ పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీవీకే అధినేత విజయ్ కోరారు.
బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Also Read
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!

ఓటేసిన ప్రముఖులు
సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ తెల్ల చొక్కా, దానికి సరిపోయే తెల్ల ప్యాంటు ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చారు. విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ చెన్నైలోని ఆల్వార్‌పేట్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువాన్మియూర్‌లో నటుడు అజిత్ కుమార్ ఓటు వేశారు.
State Assembly Elections | Approximate voter turnout as of 11 am
Tamil Nadu – 37.56%
West Bengal (phase 1) – 41.11% pic.twitter.com/CIz8eIj3Q5— ANI (@ANI) April 23, 2026
తాజావార్తలు
-
CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
-
Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
-
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
-
Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!