తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కారులో నుంచి బయటకు వస్తున్న ఓ మహిళను టీవీకే ప్రభుత్వంలోని పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి ఎస్. కీర్తనగా సోషల్ మీడియాలో కొందరు తప్పుగా ప్రచారం చేశారు. ఈ వీడియో తెగ వైరల్‌గా మారడంతో మంత్రి కీర్తన స్పందించి వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా వీడియోలో ఉన్న మహిళ మీడియా ముందుకు వచ్చింది. తమిళనాడు మంత్రి కీర్తనగా పొరబడుతున్న వీడియోలో ఉన్నది తానేనని మహిళ క్లారిటీ ఇచ్చింది. మంత్రిగా పొరబడిన వీడియోపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై జరుగుతున్న చర్చను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ట్రోలింగ్ చూశాక.. బయటకు వెళ్లాలంటనే భయంగా ఉందని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమిళనాడు మంత్రిగా తప్పుగా గుర్తించడంతో తన జీవితం తలకిందులైందని బాధిత మహిళ వినోషా రవి అన్నారు. మహిళలను వారి దుస్తుల ఆధారంగా అంచనా వేయవద్దని.. ఆన్‌లైన్‌లో మరింత బాధ్యతగా ఉండాలని వినోషా రవి ప్రజలకు పిలుపునిచ్చారు.
వివాదం ఎలా మొదలైంది?
సోషల్ మీడియాలో కొన్ని ఖాతాల నుంచి ఈ వీడియోను షేర్ చేస్తూ.. అందులో కనిపిస్తున్న మహిళ కీర్తననేనా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వీడియోలో సదరు మహిళ పొట్టి నల్లటి దుస్తులు ధరించి కనిపించారు. దీంతో ఆమె దుస్తులపై కూడా కొందరు తీవ్ర వ్యాఖ్యలు, ట్రోలింగ్ చేశారు. అయితే వీడియోలో ఉన్న మహిళ తాను కాదని కీర్తన స్పష్టం చేశారు. తనను పోలి ఉండటంతో సంబంధం లేని మహిళను కూడా ఈ వివాదంలోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళకు క్షమాపణలు చెబుతూ.. “మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు నచ్చిన విధంగా, మీ స్వేచ్ఛతో జీవించడం కొనసాగించాలని కోరుకుంటున్నాను” అంటూ ఆమెకు మద్దతు తెలిపారు.
ఈ వ్యవహారంపై కీర్తన ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయడం కొత్తేమీ కాదని అన్నారు. “మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉన్న నాయకుడి అనుచరుల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?” అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు, పనితీరుపై విమర్శించడానికి సరైన అంశాలు లేనప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. “సానుకూలంగా చెప్పడానికి, చేయడానికి ఏమీ లేని వారి వద్ద మహిళా వ్యతిరేక ధోరణి అత్యంత పురాతన ఆయుధం” అని కీర్తన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే స్పందన
కీర్తన వ్యాఖ్యలపై డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్‌బీ రాజా కూడా స్పందించారు. మహిళలను వారి వ్యక్తిగత ఎంపికల కారణంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధించడం అసహ్యకరమని అన్నారు. “మహిళలను, వారి వ్యక్తిగత ఎంపికలను కించపరిచేందుకు కొందరు ప్రయత్నించడం చాలా బాధాకరం. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా ఇందులోకి లాగుతున్నారు” అని రాజా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మహిళల గౌరవం, హక్కులు, స్వేచ్ఛకు డీఎంకే ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మర్యాద హద్దులు దాటే ఎలాంటి చర్యలను అయినా సహించబోమని పేర్కొన్నారు.
சமூக வலைதளங்களில் வைரலாகும் வீடியோவில் இருப்பது நான் அல்ல. அது நானாக இருந்தாலும் அதனால் என்ன? பெண்ணின் உடை, தோற்றம், மகிழ்ச்சி ஏன் பொது விவாதமாகிறது? அரசியல் விவாதம் முடியாதவர்கள் தனிப்பட்ட வாழ்க்கையை விமர்சிப்பதாக குற்றச்சாட்டு
– கீர்த்தனா காருTVK தற்குறிகளுக்கு செருப்படி 🤣💥 pic.twitter.com/beno6zg8Wd
— Dr. தீபக் (@nikaran_tn) August 23, 2026

