NTV Telugu Site icon

Tamil Nadu: శభాష్ నందిని.. ప్లస్ టూలో 600/600 మార్కులు.. సీఎం అభినందనలు

Tn Plus Two Topper

Tn Plus Two Topper

Tamil Nadu: తమిళనాడులో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నేపథ్యం, కార్పెంటర్ కూతురు ప్లస్ టూలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు అందుకుంది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో 12వ తరగతి దిండిగల్ విద్యార్థిని ఎస్ నందిని ఏకంగా 600కు 600 మార్కులు సాధించింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (డీజీఈ) సోమవారం వెల్లడించిన ఫలితాల్లో నందిని 600/600 స్కోర్ సాధించింది.

సీఎం స్టాలిన్ నందినితో పాటు కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన స్టాలిన్.. నందిని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. అన్నామలైయార్ మిల్స్ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివిన నందిని తమిళ్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్లలో నూటికి నూరు మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ‘చదువును ఎవరూ దొంగతనం చేయలేని ఆస్తి’అని తాను పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. విద్యను ఆస్తిలా భావించి చదివానని నందిని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూసి గర్వపడ్డానన్నారు. తాను స్వయంగా ఫోన్ చేసి అభినందించానని తెలిపారు.ఆమె ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Geomagnetic storm: భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాదం.. వలస పక్షులు, శాటిలైట్లపై ప్రభావం

600కి 600 సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, దీన్ని నా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అంకితం చేయాలనుకుంటున్నానని మనలో ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని నందిని వెల్లడించింది. తాను ఆడిటర కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది.