NTV Telugu Site icon

Dahi Controversy: తమిళనాడులో “దహీ” వివాదం.. పెరుగు ప్యాకెట్లపై హిందీ పేరు ఉండొద్దన్న సీఎం

Mk Stalin

Mk Stalin

Dahi Controversy: తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర లేదు. హిందీ పదం కనిపిస్తే చాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని చెబుతోంది. తాజాగా మరోసారి హిందీ కేంద్రంగా మరో వివాదం తమిళనాడులో చోటుచేసుకుంది. పెరుగు ప్యాకెట్లపై ‘‘దహీ’’ ఉండొద్దని చెబుతోంది తమిళనాడు ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ఉండటం హిందీని రద్దు ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

Read Also: India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..

ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) హిందీ మాట్లాడని దక్షిణాది రాష్ట్రాల రద్దుతోందని, పెరుగుకు సమానం అయిన తమిళ పదాన్ని ఉపయోగించాలని కోరారు. ప్రజల మనోభావాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని స్టాలిన్ ట్వీట్‌లో కోరారు. తమిళం, కన్నడం మాట్లాడే రాష్ట్రాల్లో కూడా పెరుగు ప్యాకెట్లపై దహీ అనే హిందీ పదాన్ని వాడుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు దక్షిణాది నుంచి హిందీని శాశ్వతంగా బహిష్కరించేలా చేస్తాయని స్టాలిన్ పేర్కొన్నాడు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచనలను రాష్ట్రంలో అమలు చేయబోమని, పెరుగు ప్యాకెట్లు పెరుగు అనే పదానికి తమిళ సమానమైన ‘‘తైర్’’ అని ముద్రించాలని ఆ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి మంత్రి ఎస్ఎం నాసర్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఇటీవల పెరుగు సాచెట్లపై స్థానిక పేర్లను ఉపయోగించాలని కోరాయి.