NTV Telugu Site icon

ED Officer Arrest: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ ఆఫీసర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Ed Officer Arrest

Ed Officer Arrest

ED Officer Ankit Tiwari Arrest: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు ఓ ఈడీ అధికారి. ఓ వ్యక్తి నుంచి రూ. 20 లక్షలను లంచం తీసుకుంటూ పోలీసులు చిక్కాడు. దీంతో అతడి అరెస్టు చేసి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఈడీ సీనియర్ ఆఫీసర్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈడీ సీనియర్ ఆఫీసర్ అంకిత్ తివారి దిండిగల్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసేందుకు రూ. 20 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Electricity bill: రూ.5000 కరెంట్ బిల్లుకు, రూ. 195 కోట్ల రసీదు.. ఏం జరిగిందంటే..?

ఈ క్రమంలో తివారి అతడి నుంచి లంచం తీసుకుంటుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో తివారిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నారు. తివారిని కావాలనే ఈ కేసులో ఇరికించారనే ఊహాగాణాలు వస్తున్నాయి. కాగా ఇటివల మనీలాండరింగ్ ఆరోపణలతో అధికార పార్టీ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన సంతి తెలిసిందే. ఆయనతో పాటు డీఎంకే పార్టీకి చెందిన పలువురు రాజకీయ నేతలపై కూడా మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈడీ వారిని విచారిస్తు్న్న క్రమంలో సీనియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అరెస్టు కావడం తమిళనాట చర్చనీయాంశమైంది.

Also Read: Video: అమ్మకు నేనంటే ఇష్టం లేదు.. నాన్న ప్రేమగా చూడరు.. నాలుగేళ్ల చిన్నారి ఎమోషనల్