NTV Telugu Site icon

Tamil Nadu: తొలిసారి గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే 10 బిల్లులు ఆమోదం

Mkstalin

Mkstalin

దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి లేకుండా 10 బిల్లులు ఆమోదం పొందాయి. తమిళనాడుకు చెందిన పెండింగ్ బిల్లులు ఆమోదించినట్లుగా ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమెదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: Delhi: ఎయిర్‌పోర్టులో మెరుగుపడని పరిస్థితులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన పరిసరాలు

అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే ఉంచుకున్నారని.. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెనక్కి పంపిన బిల్లులను తిరిగి పంపితే.. రెండోసారి ఆమోదించి పంపినా ఆమోదం తెల్పలేదని పేర్కొంది. దీంతో సుప్రీం ధర్మాసనం.. ఆ బిల్లులు ఆమోదించినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా గవర్నర్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. బిల్లులు ఆమోదించకుండా ఎందుకు తొక్కిపెట్టారని నిలదీసింది.

ఇది కూడా చదవండి: Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు