Site icon NTV Telugu

Tamil Politics: ఎన్డీయే- విజయ్ పొత్తు లేనట్లే.. కారణం రజనీకాంత్…

Tamil Politics

Tamil Politics

Tamil Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈసారి తమిళనాట త్రిముఖ పోరు నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ప్రత్యక్ష పోటీ ఉండేది. అయితే, ఈ సారి సినీ నటుడు విజయ్ తన టీవీకే పార్టీలో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కు తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఇతర పార్టీలను కూడా కలవరపెడుతున్నాయి. మరోవైపు విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌కు డిప్యూటీ సీఎం, 80 సీట్లను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ చర్చల్లో విజయ్ ముఖ్యమంత్రి పదవి కోరినట్లు తెలుస్తోంది.

Read Also: Dhurandhar 2 : నా బామ్మర్ది ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడు : ఆదిత్య ధర్

ఇదిలా ఉంటే, ఇప్పుడు బీజేపీ-విజయ్ మధ్య పొత్తు చర్చలు దాదాపుగా ముగిసినట్లే అని తెలుస్తోంది. దీనికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అనే వాదన వినిపిస్తోంది. టీవీకే కీలక నేత అధవ్ అర్జున్ రజనీ కాంత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే భయపెట్టింది.’’ అని ఆయన అనడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. డీఎంకేతో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి ఈ వ్యాఖ్యలను రాజకీయంగా అసభ్యకరమైనవిగా అభివర్ణించారు. సూపర్‌స్టార్‌కు ఉన్న భారీ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచారు. రజనీకాంత్ రాజకీయాలకు అతీతంగా అంతా అభిమానించే సినీ ప్రముఖుడని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని అఅన్నారు. బీజేపీ నేత అన్నామలై కూడా సూపర్‌స్టార్‌పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా విమర్శించారు. దాదాపుగా మూడు దశాబ్ధాల పాటు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యలు, కోవిడ్-19 కారణం వల్ల 2020లో అధికారికంగా రాజకీయాల నుంచి వైదొలిగారు.

Exit mobile version