తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. డీఎంకేలో మరో యువ నాయకుడ్ని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో అన్నామలై లాంటి యువ నాయకులు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా.. తన రాజకీయ వారసుడ్ని హైలెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. తాజాగా కుమారుడికి ప్రమోషన్ కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కొడుకును ఉప ముఖ్యమంత్రిగా చేసి.. భారాన్ని తగ్గించుకోవాలని సీఎం స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు డీఎంకే వర్గాల నుంచి వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Chandipura Virus: ‘చండీపురా వైరస్’ ఏమిటి.? లక్షణాలు, నివారణ, చికిత్స వివరాలు..
ప్రభుత్వంలోని పెద్దల అంగీకారంతోనే ఈ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఆగస్టు 22లోపు ఉదయనిధి స్టాలిన్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారని ఆ వర్గాలు పేర్కొ్న్నాయి. ఇదిలా ఉంటే.. 2009లో కూడా కరుణానిధి తన కొడుకు స్టాలిన్‌ను కూడా ఉప ముఖ్యమంత్రిని చేశారు. అదే వారసత్వంగా.. ఇప్పుడు స్టాలిన్ కూడా తన కొడుకును డిప్యూటీ సీఎంను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో.. మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Minister Ram Prasad Reddy: శాంతియుతంగా పరిపాలన కొనసాగించడమే మా ప్రభుత్వ లక్ష్యం