Site icon NTV Telugu

MK Stalin: తమిళనాడు సీఎంకు కరోనా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్టాలిన్‌

Mk Stalin

Mk Stalin

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. స్టాలిన్‌కు మంగళవారం కరోనా సోకినట్లు ఆయన ప్రకటించారు. రెండ్రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో సీఎం స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన కొవిడ్ స్వల్ప లక్షణాలతో చెన్నై అల్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని… ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా అందరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్‌లు తీసుకోవాలని కోరారు.

TDP : ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే విన్నపాలేంటి.? ఇంతలో మరో నాయకుడు కర్చీఫ్ వేస్తున్నారా.?

ముఖ్యమంత్రి స్టాలిన్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ గవర్నర్ రవి పేర్కొన్నారు. స్టాలిన్ త్వరగా కోలుకోవాలని ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషిని కొనసాగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ట్వీట్ చేశారు. స్టాలిన్ త్వరగా కోలుకోవాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కూడా ఆకాంక్షించారు.

Exit mobile version