Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
- తమిళనాడులో మొదలైన క్యాంప్ రాజకీయాలు
- పార్టీల్లో మొదలైన జంపింగ్ భయం
- పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని గవర్నర్ ఆహ్వానించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను కూడా పిలవలేదు. ఇప్పటికే 113 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు విజయ్ అందజేశారు. అయినా కూడా గవర్నర్ ససేమిరా అన్నారు.
ఇలాంటి తరుణంలో ఏఐఏడీఎంకే (అన్నాడీఎంకే)కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో చేరవచ్చని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పళనిస్వామి అప్రమత్తం అయ్యారు. ఎమ్మెల్యేలందరినీ పుదుచ్చేరికి తరలించారు. ఆర్కేఎన్ బీచ్ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలంతా మకాం వేశారు. లగ్జరీ రూమ్‌లు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలతో పళనిస్వామి సమావేశం కానున్నారు. ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యేలతో ఎంకే. స్టాలిన్ కూడా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలెవరూ జారిపోకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం.
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- PM Modi: న్యూజిలాండ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్‌ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. వామపక్షాలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఏం జరగబోతుందో రేపు తేలిపోనుంది.
తాజావార్తలు
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్‌లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!