Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lt General Dhiraj Seth: ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు ఖరారయ్యారు. కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(ఆర్మీ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ‘వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్’గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సేథ్, ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన 1986 డిసెంబర్లో ‘ఆర్మర్డ్ కార్ప్స్’లో నియమితులయ్యారు. ఆయన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో జూనియర్ కమాండ్ కోర్సులో ప్రథమ స్థానం సాధించి, ఉత్తమ ఆల్-రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్ పతకాన్ని అందుకున్నారు.
దాదాపు నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. విశిష్ట సైనిక సేవా కాలంలో ఆయన కార్యకలాపాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, సామర్థ్యాల పెరుగుదల, సంస్థాగత విభాగాలలో విస్తృత అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో విశేష కృషి చేశారు. సైనిక దళాల ఆధునీకీకరణలో తనదైన ముద్ర వేశారు. సేథ్ జమ్మూ కాశ్మీర్లో ఒక సాయుధ రెజిమెంట్, ఒక సాయుధ బ్రిగేడ్లకు నాయకత్వం వహించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందిన తర్వాత ఆయన సుదర్శన్ చక్ర కార్ప్స్కు కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా పనిచేస్తూ, అనేక ప్రధాన జాతీయ మరియు అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ సేథ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్ మరియు సదరన్ కమాండ్ రెండింటికీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C)గా పనిచేశారు. దీని ద్వారా రెండు ఆపరేషనల్ కమాండ్లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సాధించారు. ఇదే కాకుండా అంగోలాలో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో సెక్రటరీగా, సౌత్ వెస్ట్రన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా, మరియు డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్, సెరిమోనియల్ అండ్ వెల్ఫేర్ వంటి అనేక కీలక స్టాఫ్ మరియు వ్యూహాత్మక పదవులను కూడా నిర్వహించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!