NTV Telugu Site icon

Swati Maliwal: ‘నా పర్సనల్ ఫోటోలు లీక్ చేయాలని వారిపై ఒత్తిడి’’.. స్వాతి మలివాల్ సంచలనం..

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal: స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత అయిన స్వాతి మలివాల్‌‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో అతని సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టుకు ముందు బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్ చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో బీజేపీ ఆప్‌పై ధ్వజమెత్తుతోంది.

Read Also: Uttar Pradesh: 25 ఏళ్ల యువతి, 16 ఏళ్ల అబ్బాయితో లవ్.. తనతోనే ఉంటా లేకపోతే చస్తా అంటూ బెదిరింపు..

తాజగా స్వాతి మలివాల్ ఆప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి చెందిన సభ్యులకు తనపై చెడుగా చెప్పాలని, వ్యక్తిగత ఫోటోలు లీక్ చేయాలని ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఆమె ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నిన్న పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి నుంచి నాకు కాల్ వచ్చింది. నాపై దుష్ప్రచారం చేయాలని, నా వ్యక్తిగత ఫోటోలు లీక్ చేయడం ద్వారా నన్ను దెబ్బతీయాలని పార్టీ ఒత్తిడి తీసుకువస్తోంది. నాకు మద్దతు ఇస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఎవరికో ప్రెస్ కాన్ఫరెస్స్ డ్యూటీ ఇవ్వబడింది. మరొకరికి ట్వీట్స్ చేసే బాధ్యత ఇచ్చారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.

అమెరికాలో కూర్చున్న వాలంటీర్లను పిలిపించి, తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని, నిందితుడికి సన్నిహితంగా ఉన్న బీర్ రిపోర్టర్లకు కొన్ని నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చాయని ఆమె ఆరోపించారు. మీరు వేల మంది సైన్యాన్ని పెంచుకున్నప్పటికీ, తన దగ్గర నిజం ఉందని, ఒంటరిగా వారిని ఎదుర్కొంటానంటూ వ్యాఖ్యానించారు. తనకు ఎవరి పైనా కోపం లేదని, నిందితుడు చాలా శక్తివంతమైనవాడు, పెద్ద నాయకులు కూడా అతనికి భయపడుతున్నారని ఆమె అన్నారు. తాను బీజేపీతో టచ్‌లో ఉన్నానని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన మహిళా మంత్రి చిరునవ్వుతో నను కించపరచడం తను బాధించిందని స్వాతి మలివాల్ అన్నారు. తాను ఆత్మగౌరవ పోటారాన్ని ప ప్రారంభించానని, నాకు న్యాయం జరిగే వకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు.