Site icon NTV Telugu

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వరాభాస్కర్

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Swara Bhasker joins Bharat Jodo, walks with Rahul Gandhi in Ujjain: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్రతో కన్యాకుమారిలో ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో ముగిసిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ చేరింది. ఇదిలా ఉంటే గురువారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.

Read Also: MLC Kavitha: మోడీ వచ్చే ముందు ED రావడం సహజం.. జైల్లో పెడతాం అంటే బయపడం!

గురువారం ఉజ్జయినిలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు స్వరాభాస్కర్. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల రాహుల్ గాంధీకి మద్దతుగా భారత్ జోడోయాత్రలో పాల్గొన్నారు. పూజా భట్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, రియా సేన్, అమోల్ పాలేకర్లు పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు. బీజేపీని విపరీతంగా ద్వేషించే స్వరా భాస్కర్, జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాలీవుడ్ ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొనడాన్ని బీజేపీ ‘ గెస్ట్ రోల్’గా విమర్శించింది. పెయిడ్ యాక్టర్లు యాత్రలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది.

కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు భారత్ జోడో యాత్ర ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు కొనసాగనుంది. కాశ్మీర్ తో చేరడంతో యాత్ర ముగుస్తుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర 83వ రోజుకు చేరుకుంది. మొత్తం 7 రాష్ట్రాల్లో 36 జిల్లాల్లో 1209 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ.

Exit mobile version