Site icon NTV Telugu

Cylinder on the track: రైల్వే ట్రాక్‌పై సిలిండర్.. సకాలంలో బ్రేకులు వేసిన లోకో పైలట్..

Cylinder On The Track

Cylinder On The Track

Cylinder on the track: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ రైల్వే ట్రాక్‌పై మరోసారి అనుమానాస్పద వస్తువు కనిపించింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లోక్‌పైలట్ ట్రాకుపై ఉన్న వస్తువుని గుర్తించి సకాలంలో బ్రేకులు వేశాడని పోలీసులు తెలిపారు. ట్రాక్‌పై ఎర్రని సిలిండర్‌ని గమనించి, దానికి దూరంగా రైలుని ఆపినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ దిమ్మలు గుర్తించిన అనేక కేసుల మధ్య తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Rajnath Singh: భారత్‌తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..

ముంబై నుంచి లక్నో వెళ్తున్న రైలు గోవింద్‌పురి స్టేషన్ సమీపంలో హోల్డింగ్ లైన్‌లోకి చేరుకున్న సమయంలో, ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు పట్టాలపై ఫైర్ సేఫ్టీ సిలిండర్‌ని లోకో పైలట్ చూసి షాక్‌కి గురయ్యాడు. రైలు వేగం తక్కువగా ఉందని, దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అతను చెప్పాడు. దీనిని ఇండియన్ రైల్వేలకు చెందిన ఫైర్ సేఫ్టీ సిలిండర్‌గా గుర్తించారు.

కంట్రోల్ రూమ్‌కు చెప్పడంతో డ్రైవర్ సిలిండర్‌ను కాన్పూర్ సెంట్రల్‌కు తీసుకొచ్చాడు. సెక్షన్ ఇంజనీర్ సిలిండర్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు. శనివారం బందా-మహోబా రైలు ట్రాక్‌పై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచి, రైళ్లకు అంతరాయం కలిగించిన 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం బైరియాలోని రైల్వే ట్రాక్‌పై ఉంచిన రాయిని మరో రైలు ఇంజన్ ఢీ కొట్టింది.

Exit mobile version