NTV Telugu Site icon

ఐపీఎస్‌ ఆఫీసర్‌పై దేశద్రోహం కేసు.. కారణం ఇదే..!

GP Singh

GP Singh

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్‌ ఆఫీసర్‌ జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు.. అక్రమాస్తుల కేసులో జీపీ సింగ్‌ను గత వారమే సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు.. అయితే, ఆయన ఇంట్లో సోదాల సందర్భంగా.. ఏసీబీ, ఎక‌నామిక్ అఫెన్సెస్ వింగ్‌కు కొన్ని కీలకమైన కాగితాలు దొరికాయి.. రెండు వర్గాల మధ్య విబేధాలు సృష్టించేలా.. శతృత్వాన్ని పెంచేలా.. ఘర్షణలకు దారితీసేనలా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై కుట్ర పనినట్టు ఆరోపిస్తున్న పోలీసులు.. జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు.. రాయ్‌పూర్‌లోని కొత్వాలి పోలీసు స్టేష‌న్‌లో ఐపీసీ సెక్షన్ 124-ఏ, 153-ఏ ప్రకారం జీపి సింగ్ పై కేసులు న‌మోదు చేసినట్టు తెలిపారు..

ఇక, అక్రమాస్తుల కేసులో ఇటీవలే మూడు రోజుల పాటు ఏసీబీ, ఈఓడ‌బ్ల్యూలు సుమారు 15 చోట్ల సోదాలు నిర్వహించారు.. జీపీ సింగ్‌ దగ్గర సుమారు ప‌ది కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ జీపీ సింగ్‌.. గ‌తంలో ఏసీబీలో అడిష‌న‌ల్ డైర‌క్టర్ జ‌న‌ర‌ల్‌గా చేశారు. జీపీ సింగ్ సింగ్ ఇంట్లో కొన్ని చింపేసిన కాగితాలు దొరికాయ‌ని, వాటిని ప‌రిశీలిస్తే.. ఏదో కుట్ర ప‌న్నిన‌ట్లు అర్థమైంద‌ని పోలీసులు చెబుతున్నారు.. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాల ఆధారంగా తనపై చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ తెలిపారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను కూడా సూచించిందన్నారు.. అయితే, తనపై దేశద్రోహ కేసులో సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనపై సిబిఐ వంటి స్వతంత్ర ఏజెన్సీ చేత దర్యాప్తు చేయించాలని కోరాడు.