NTV Telugu Site icon

HMPV Virus: భారత్లో విజృంభిస్తున్న HMPV వైరస్.. గుజరాత్‌లో మరో కేసు..

Hmpv Case

Hmpv Case

HMPV Virus: భారతదేశంలో HMPV వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరల్ సోకగా.. తాజాగా, గుజరాత్‌ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూశాయి. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ICMR సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Read Also: Stock Market Crash: స్టాక్ మార్కెట్స్పై చైనా వైరస్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు..

అయితే, ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే వ్యాప్తి చెందుతుంది. ఇది శీతాకాలంలో జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంది. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. కాగా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జలుబు, ఫ్లూ లక్షణాలుఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. తుమ్ములు, దగ్గు వచ్చినపుడు కర్చీఫ్ లాంటివి అడ్డుపెట్టుకోవాలి.. అలాగే, చేతులను తరచూ క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. దీంతో పాటు కరచాలనం చేయడం, జబ్బు ఉన్న వారి దగ్గరకు వెళ్లడం, కళ్లు, ముక్కును తరచూ తాకడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చేయొద్దని వైద్యులు వెల్లడించారు.

Show comments