Sushil Mann, the hero who saved Rishabh Pant: శుక్రవారం ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. అయితే ఆ ప్రమాాదం నుంచి రిషబ్ పంత్ ను కాపాడి హీరోగా నిలిచారు సుశీల్ మాన్. ప్రస్తుతం అతనిపై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. అయితే ఆ భయానక ప్రమాద క్షణాలను గుర్తుచేసుకున్నారు మాన్. అయితే అంతటి భయానక ప్రమాదంలో పంత్ బతికి ఉండే అవకాశమే లేదని బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ వెల్లడించారు. పంత్ కారు ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రమాదానికి గురైంది.
తమ బస్సుకు 300 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగిందని.. ఆ తరువాత బస్సులోని ప్రయాణికులు పంత్ ను రక్షించేందుకు వచ్చారని మన్ వెల్లడించారు. కారులో మంటలు చెలరేగడానికి ముందు పంత్ కారు మూడు నాలుగు సార్లు పల్టీలు కొట్టిందని మన్ తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికలు తీవ్రంగా భయపడ్డట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం హరిద్వార్ నుంచి ఉదయం 4.25 గంటలకు బస్సు బయలుదేరిందని..ఒక స్టాప్ వద్ద, నాకు 300 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించాను. ఏదో తప్పు జరిగిందని కండక్టర్ తో చెప్పానని.. బస్సుకు ఎదురుగా కారు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికలు భయాందోళనకు గురయ్యారని అన్నారు.
Read Also: Bandi Sanjay : హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది
ప్రమాదం సమయంలో పంత్ సగం కారు బయట ఉన్నాడని, నేను నా కండక్టర్ కారు వద్దకు వెళ్లి అతడిని బయటకు తీసుకొచ్చామని.. ప్రయాణికులు కూడా సహాయం చేశారని మన్ తెలిపాడు. ఆ సమయంలో కారులో ఒంటరిగా ఉన్నావా..? అని పంత్ ను ప్రశ్నించానని.. అందుకు అతను ‘అవును’ అని సమాధానం ఇచ్చాడని తెలిపారు. ప్రమాద సమయంలో పంత్ స్పృహలోనే ఉన్నాడని.. అప్పటికే కారులో మంటలు చెలరేగాయని..ఒక వేళ కాస్త ఆలస్యం అయినా పంత్ బతికే వాడు కాదని తెలిపారు.
ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ‘‘ నేను రిషబ్ పంత్, క్రికెటర్’ అని చెప్పాడని, ఆ తరువాత అతడిని తీసి డివైడర్ పై పడుకోపెట్టామని.. తాడేందుకు పంత్ నీరు అడిగారని, మేము ఇచ్చామని సుశీల్ మాన్ తెలిపారు. ప్రయాణికుల్లో ఒకరు పంత్ శరీరాన్ని గుడ్డతో కప్పారని.. ఆతరువాత పోలీసులకు ఫోన్ చేసినా, అంబులెన్స్ కు ఫోన్ చేసినా బిజీ వచ్చిందని తెలిపారు. కండక్టర్ బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్ధాం అని చెప్పాడని.. అయితే ఆ సమయంలోనే పోలీసులు అంబులెన్స్ వచ్చాయని తెలిపారు సుశీల్ మాన్. పంత్ ను మొదటగా సక్షం హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి అక్కడ నుంచి డెహ్రాడూన్ మాక్స్ హస్పిటల్ కు తరలించారు.