NTV Telugu Site icon

Ayodhya Ram madir: ప్రధాని మోడీ స్పూర్తితోనే ‘‘సూర్య తిలకం’’ ఆచారం: అయోధ్య ట్రస్ట్..

Pm Modi

Pm Modi

Ayodhya Ram madir: అయోధ్య రామమందిరంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ రోజు బాలరాముడి నుదుడిపై ‘‘సూర్య తిలకం’’ కార్యక్రమం జరిగింది. సూర్యడి కిరణాలు రాముడి నుదిటిపై ప్రకాశించాయి. అయితే, ఈ ‘‘సూర్య తిలకం’’ వేడుక ప్రధాని నరేంద్రమోడీ స్పూర్తితో జరిగిందని ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్ చెప్పారు. రామ మందిర నిర్మాణ కమిటి అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పుడు ప్రధాని ఈ ఆలోచనను ప్రతిపాదించారని అన్నారు. రామ నవమి రోజున, ఆలయ గర్భగుడిలో ఉంచిర రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు తాకేలా చూసుకున్నామని, ప్రధాని కలను నిజం చేశామని ఆయన చెప్పారు. ప్రతీ రామ నవమి వేడుక రోజు ఈ ఆచారాన్ని నిర్వహిస్తామని చెప్పారు. దీని కోసం మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలతో కలిసి ప్రాజెక్టు రూపొందించామని అన్నారు.

Read Also: USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..

సూర్య తిలకం ఆచారాన్ని ప్రధాని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ క్షణం అద్భుతమైనదిగా, సాటిలేనిదిగా పీఎం మోడీ అభివర్ణించారు. అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అస్సాం నల్బరీ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘‘ఈరోజు రామ నవమి చారిత్రాత్మక సందర్భం. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, రాముడు ఎట్టకేలకు తన గొప్ప ఆలయంలో ఆసీనుడయ్యాడు మరియు కేవలం కొద్ది నిమిషాలలో, తన ‘సూర్య తిలకం’ని వర్తింపజేయడం ద్వారా పుట్టినరోజు జరుపుకుంటారు’’ అని అన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజల్ని తమ మొబైల్ ఫోన్లలో టార్చ్ ఆన్ చేసి ఈ వేడుకను సంఘీభావం తెలపాలని కోరారు. ‘‘ మా మొబైల్ ఫోన్ల ద్వారా మేము శ్రీరాముడికి నమస్కరిస్తున్నాము. జైశ్రీరాం, జైజై శ్రీరాం, రామ్ లక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ’’ అంటూ నినాదలు చేయాలని ప్రధాని కోరారు.

Show comments