Supremecourt: ఆర్య సమాజ్ పెళ్ళిళ్ళకు సుప్రీం షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించి బయట పెళ్ళిచేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది ఆర్యసమాజ్ లో పెళ్ళిచేసుకుంటుంటారు. అలా చేసుకుంటే ఇక వారికి గుర్తింపు వుండదు. ఆర్య సమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివాహ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఆర్య సమాజ్‌కు లేదని ధర్మాసనం పేర్కొంది.
Also Read
అధికారులు జారీచేసిన వివాహ ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఆర్యసమాజ్ ఇచ్చేవాటికి చట్టబద్ధమయిన గుర్తింపు లేదని సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది.మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మైనర్ అయిన తమ కుమార్తెను ఓ యువకుడు అపహరించి అత్యాచారం చేసినట్లు పేర్కొన్న అమ్మాయి తల్లిదండ్రులు.. అతనిపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోస్కో చట్టం ప్రకారం కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన యువకుడు మేజర్ అయిన అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ఈ మేరకు ఆర్యసమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రం సమర్పించగా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో ఆర్యసమాజ్ లో పెళ్ళిళ్ళు చేసుకున్నవారి పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. వారు విధిగా రిజిస్ట్రార్ దగ్గర వివాహ ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సి వుంటుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!