PM Modi: ఈవీఎం-వీవీప్యాట్‌లపై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లోని స్లిప్పులను, ఈవీఎంలో నమోదైన ఓట్లతో క్రాస్ చేక్ చేయాలని కోరుతూ పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, వీటిన్నింటి సుప్రీంకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పుపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇది ప్రతిపక్షాలకు ఝలక్ అని, చెంపదెబ్బగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీహార్‌లోని ఆరారియా ఎన్నికలల ర్యాలీలో ప్రసంగించిన పీఎం ఈ వ్యాఖ్యాలు చేశారు. ‘‘ఈ రోజు మన ప్రజాస్వామ్యానికి శుభదినం, ఈవీఎంలపై ఏడ్చే ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది’’ అని అన్నారు. వీవీప్యాట్‌లతో ఈవీఎంలో నమోదైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిస్టమ్‌లోని ఏదైనా విషయాన్ని గుడ్డిగా అవిశ్వసించడం వల్ల అనవసరమైన సందేహాలను తలెత్తుతాయని పేర్కొంది.
Read Also: Yodha OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాశిఖన్నా యాక్షన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘‘ప్రజాస్వామ్యం అనేది అన్ని సంస్థల మధ్య సామరస్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేయడమే’’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం రెండు సమ్మతమైన తీర్పులను వెలువరించింది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.
మరోవైపు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల, ఓబీసీ హక్కులను హరించడానిక కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ప్రధాని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను చాలా బాధ్యతతో చెబుతున్నానని అన్నారు. ‘‘భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే, కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిసోంది. దేశంలో కర్ణాటక మోడల్ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ వారిని మోసం చేస్తోంది’’ ప్రధాని అన్నారు.
