నీట్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ల కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.
సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్ తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని, వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇవి మరింతగా పెంచుతాని, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన కులాల కోటా విషయంలోనూ ఎలాంటి మార్పులుండవని, నీట్ ప్రవేశాల్లో అది కూడా అమల్లోనే ఉంటుందని పేర్కొంది.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులని తెలిపింది. ప్రవేశాలు జరిగే సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల ఆ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి 2021–22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చేది లేదని తీర్పునిచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న ఇలాంటి సమయంలో వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యమైతే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి అన్ని వర్గాల వారి అభిప్రాయాలను వినకుండా స్టే విధించడం సబబు కాదని పేర్కొంది.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!