Site icon NTV Telugu

Supreme Court: బిల్కిస్ బానో పిటిషన్‌పై ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు సుప్రీం అంగీకారం

Bilkis Bano Case

Bilkis Bano Case

Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు.

Read Also: Ignoring Social Media : రోజుకు 15 నిమిషాలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.. మీ ఆరోగ్యం సేఫ్..!

ఈ కేసులో కొత్త బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శోభా గుప్తా తన వాదనల్ని వినిపించారు. బెంచ్ ఏర్పాటు చేస్తాం, ఈ సాయంత్ర దానిని పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు. అంతకుముందు జనవరి 24న గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది, దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. మే 13, 2022 నాటి ఉత్తర్వుల్లో అత్యున్నత న్యాయస్థానం 1992 జూలై 9 నాటి పాలసీ ప్రకారం ముందస్తు విడుదల కోసం దోషి చేసిన అభ్యర్థనను పరిగణించి, శిక్ష విధించిన తేదీకి వర్తించే గడువులోగా రెండు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాభిక్షను ప్రసాదించింది, వీరందరిని విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 15న వీరంతా విడుదలయ్యారు. అయితే దీనికి వ్యతిరేకంగా బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ లో కొట్టేసింది. అయితే బీజేపీ కావాలని గుజరాత్ ఎన్నికల ముందు కావాలనే వీరిందరిని విడుదల చేసిందని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Exit mobile version