Supreme Court Seeks Portal To Assist Ukraine Returned medical Students: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న దాదాపుగా 20 వేల మంది భారతదేశానికి తిరిగివచ్చారు. అయితే తాము తమ విద్యను భారత్ తో కొనసాగించే విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం రోజున న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువు కొనసాగించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. వారి విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివరాలతో ఓ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.
Read Also: World Bank: వచ్చే ఏడాది ప్రపంచానికి “ఆర్థిక మాంద్యం” తప్పకపోవచ్చు.. వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక
విద్యార్థులు నష్టపోకుండా.. కేంద్రప్రభుత్వ, విదేశీ మంత్రిత్వ శాఖ విదేశాలతో సంప్రదింపులు జరపాలని.. వైద్యవిద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ భాష, సిలబస్ కు సరిపోయే విధంగా విద్యార్థులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో 20,000 మంది వైద్యవిద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థులు చుట్టు పక్క దేశాలను వెతుక్కొవాల్సిన పని లేకుండా కేంద్రమే చర్యలు తీసుకుంటే మంచిదని సూచించింది. అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రాం కింద ఇతర దేశాల కళాశాల్లో చేరే విధంగా అవకాశం కల్పించాలని సూచించింది. ఫీజులు, సీట్ల వివరాలు, అందుబాటులో ఉండే విధంగా పోర్టల్ ఏర్పాటు చేసిన విద్యార్థులు కావాల్సిన కాలేజ్ ఎంచుకునేలా బదిలీ ఆప్షన్ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.
అయితే ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఇండియాలో అడ్మిషన్లు కల్పించడం చట్టపరంగా సాధ్యంకాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడంతోనే వారంతా ఉక్రెయిన్ లో మెడిసిన్ విద్యను అభ్యసించేందుకు వెళ్లారని అఫిడవిట్ లో పేర్కొంది. దీంతో ఇండియాలో విద్యను కొనసాగించే వీలు లేదని తెలిపింది. కేంద్రం తరుపున ఈ రోజు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు.
