Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Read Also: YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..
ఈవీఎం నుంచి మెమోరీని చెక్ చేయడం, ధ్రువీకరించడాన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల్లో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 15 రోజుల్లో తన స్పందన దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ పిటిషన్‌ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని విచారించింది.