Site icon NTV Telugu

BJP MP: సుప్రీంకోర్టు పరిధి దాటుతోంది.. మత యుద్ధాన్ని ప్రేరేపిస్తే బాధ్యత మీదే..

Bjp Mp

Bjp Mp

BJP MP: సుప్రీంకోర్టు తీరుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీదానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీని మూసేయాలని ఆయన అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై దూసే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా బలమైన పదజాలాన్ని ఉపయోగించారు. దేశంలో మతపరమైన హింసను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టుదే బాధ్యత అని, దాని పరిధిని మించి వ్యవహరిస్తోందని అన్నారు. దేశ రాజ్యాంగాన్ని అనుసరించడం ద్వారా ఏర్పడిన చట్టాన్ని వివరించడమే సుప్రీకోర్టు పని అన్నారు.

రామ మందిరం, కృష్ణ జన్మభూమి, జ్ఞానవాపి గురించి ఏదైనా విషయం ఉన్నప్పుడు కోర్టు పిటిషనర్ల నుంచి పత్రాలు, రుజువులు చూపించమని అడుగుతుందని , కానీ మొఘల్ కాలంలో నిర్మించిన మసీదు విషయానికి వస్తే, వారు ఆధారాలు, ప్రతాలను ఎలా చూపిస్తారని కోర్టు చెబుతుందని దూబే సుప్రీంకోర్టుపై విరుచుకుపడ్డారు.

“స్వలింగ సంపర్కం పెద్ద నేరం అని చెప్పే ఆర్టికల్ 377 ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ప్రపంచంలో రెండు జెండర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పింది. అవి పురుషుడు లేదా స్త్రీ… అది హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన లేదా సిక్కు అయినా, అందరూ స్వలింగ సంపర్కం నేరమని నమ్ముతారు. ఒక రోజు ఉదయం, సుప్రీంకోర్టు ఈ కేసును రద్దు చేస్తామని చెప్పింది…,’’ అని దూబే అన్నారు. అనేక అంశాలపై సుప్రీంకోర్టుతో తన అభిప్రాయభేదాలను వ్యక్తం చేస్తూ ఈ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యాన్ని వివరించారు.

Read Also: Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 90 మంది మృతి

పార్లమెంట్ చేసే చట్టాలు, మేము ఇచ్చే తీర్పులు దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వర్తిస్తాయని ఆర్టికల్ 141 చెబుతోంది. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్‌కి అన్ని చట్టాలను రూపొందించే హక్కు ఉందని చెబుతుంది. సుప్రీంకోర్టుకు చట్టాన్ని వివరించే హక్కు ఉందని చెబుతోంది. బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్ ఏం చేయాలో సుప్రీంకోర్టు అడుగుతోంది’’ అని బీజేపీ ఎంపీ అన్నారు.

పార్లమెంట్‌లో న్యాయవ్యవస్థపై వివరణాత్మక చర్చలు జరుగుతాయని నిషికాంత్ దూబే అన్నారు. సుప్రీంకోర్టు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటోందని బీజేపీ నేత ఆరోపించారు. భారత న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు, అలాంటి పదవిని మీరు ఎలా దిశానిర్దేశం చేయగలరని సుప్రీంకోర్టుని ప్రశ్నించారు. ఈ దేశాన్ని పార్లమెంట్ చట్టాన్ని రూపొందిస్తుంది, ఆ పార్లమెంట్‌ని మీరు ఎలా నిర్దేశిస్తారు..? అని అడిగారు. మూడు నెలల్లో రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని మీరు ఎలా ఆదేశిస్తారు..? మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు అర్థమని అన్నారు.

ఇటీవల వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం, వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరులను చేర్చడం, వక్ఫ్ బై యూజర్, ఆస్తుల డీ నోటిఫై చేయడం వంటి మూడు నిబంధనలపై స్టే విధించింది. దీంతో ఒక్కసారిగా ఈ వివాదంపై బీజేపీ ఎంపీలు పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version