Site icon NTV Telugu

Supreme Court: బెంగాల్ టీచర్లకు ఉపశమనం.. కీలక ఆదేశాలు జారీ

Supremecourt

Supremecourt

బెంగాల్ ఉపాధ్యాయులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీపికబురు చెప్పింది. కొత్తగా ఉద్యోగుల్ని నియమించేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చని సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాజా తీర్పుతో ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం లభించింది.

ఇది కూడా చదవండి: Retro : పూజా హెగ్డే ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా..?

ఇటీవల 25 వేల టీచర్‌ పోస్టుల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయని న్యాయస్థానం పేర్కొంది. దీంతో 25 వేల మంది  ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో బాధితులు రోడ్డుపైకి ఎక్కారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందారు. ఇక ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాజా తీర్పుతో టీచర్లకు కొంత ఉపశమనం లభించింది.

ఇది కూడా చదవండి: AK : అజిత్ కుమార్.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే ఓ బ్రాండ్

ఇక డిసెంబర్ 31 నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని న్యాయస్థానం సూచించింది. అప్పటి వరకు పాత ఉపాధ్యాయులే కొనసాగవచ్చని పేర్కొంది. అయితే ఈ తీర్పు అక్రమాలకు పాల్పడని ఉపాధ్యాయులకే మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 2016 నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడని వారు కొనసాగవచ్చు అని.. ఇక మే 31 నుంచి డిసెంబర్ 31 వరకు కొత్త నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

Exit mobile version