NTV Telugu Site icon

Supreme Court: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం

Sc

Sc

Supreme Court: ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇజ్రాయెల్‌కు భారత్‌ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనింది.

Read Also: CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల సాయం.. సీఎం చంద్రబాబు అభినందనలు

కాగా, ఈ విధంగా ఆదేశాలిస్తే.. ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థలు ఒప్పందాల ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.. అందుకే ఆ సంస్థలను నిలువరించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనింది. ఇలాంటి విషయాలు విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయని తెలిపింది. అయితే, అశోక్‌ కుమార్ శర్మ, మరికొందరు వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేసే భారతీయ సంస్థల లైసెన్సు క్యాన్సిల్ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో చెప్పుకొచ్చారు.

Read Also: Bigg Boss Telugu 8: సీజన్ 1 నుంచే ఆంటీల సెంటిమెంట్.. ఫస్ట్ వీక్ బయటకొచ్చేసిన వారి లిస్ట్ ఇదే!

ఇక, గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి చేయడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని మొదలు పెట్టడంతో.. అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గాజాలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న ఈ పోరులో 40 వేల మందికిపైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు విడిచారని స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్‌ దాడిని ఖండించిన భారత్‌.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యం కావడంతో.. ఇటీవల ఆరుగురు బందీలు మరణించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చర్చలు సక్సెస్ కావడానికి తగిన ప్రయత్నాలను బెంజిమన్ నెతన్యాహు చేయడం లేదని పరోక్షంగాణ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.