Site icon NTV Telugu

Google: సుప్రీంకోర్టులో గూగుల్‌కు చుక్కెదురు.. రూ.1337 కోట్ల పెనాల్టీ కట్టాల్సిందే

Google

Google

Supreme Court Rejects Google’s Request Against ₹ 1,337 Crore Penalty: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ కు సుప్రీంకోర్టులో గురువారం చుక్కెదురు అయింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తీర్పును సవాల్ చేస్తూ గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది. అయితే ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనలను అతిక్రమించి గుత్తాధితప్యంగా వ్యవహరిస్తోందని గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ.1337 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ సుప్రీంను ఆశ్రయించింది.

Read Also: Manchu Manoj: మరోసారి మంచు వారింట పెళ్లి భాజాలు.. మోహన్ బాబుకు ఇష్టమేనా..?

తాజాగా మొత్తం పెనాల్టీలో కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వద్ద 10 శాతం పెనాల్టీని ఏడురోజుల్లో డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. కేసు విచారణ కోసం గురువారం నుంచి మూడు రోజుల్లోగా (ఎన్సీఎల్ఏటీ) సంప్రదించాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31లోగా గూగుల్ ఆప్పీల్ పై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను సుప్రీంకోర్టు కోరింది.

దేశంలో ఆండ్రాయిడ్ గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గూగుల్ పై సీసీఐ జరిమానా విధించింది. దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని గూగుల్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ది 97 శాతం. అయితే నిబంధనలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రధాన ఆరోపణ. గూగుల్ సంస్థ యూరప్ దేశాల్లో ఒకలా భారత్ తో మరోలా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ తరుపున సోలిసిటర్ జనరల్ వెంకట్ రామనన్ వాదనలు వినిపించారు.

Exit mobile version