CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!

  • సీజేపీ నిరసనల వేళ ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
  • ఆంక్షలు ప్రజా జీవనానికి అడ్డుకావద్దని సూచించిన సుప్రీంకోర్టు..
  • జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయం వేదిక పరిశీలనకు కేంద్రం హామీ..
Supreme Court Traffic

Supreme Court Traffic

CJP Protest:  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 57 మెట్రో స్టేషన్లను మూసేయాలన్న పోలీసుల నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. మెట్రో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిషేధించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. నిరసనలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని, అయితే అవి ప్రజలకు భారంగా మారొద్దని సూచించారు. “ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగించకూడదు” అన్న సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో జంతర్ మంతర్‌కు బదులుగా మరో నిరసన ప్రదేశాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. నిరసన హక్కుతో పాటు పౌరలు ప్రయాణస్వేచ్ఛ, ప్రజా రవాణా వినియోగం, ప్రాథమిక సౌకర్యాలను కూడా కాపాడే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.