Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు?
- సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- ఈ విషయంలో బ్యూరోక్రాట్లు ఆలోచించాలని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓబీసీ రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుని.. ఐఏఎస్ వంటి కీలక పదవుల్లో ఉంటే.. వారి పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ అవసరమా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్య, ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక స్థాయి కూడా పెరుగుతుందని.. అయినప్పటికీ తరతరాలుగా రిజర్వేషన్ కొనసాగితే దాని ఉద్దేశమే ఏమిటని వ్యాఖ్యానించింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కురుబా సమాజానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఓబీసీ రిజర్వేషన్ కింద ఎంపికయ్యాడు. అయితే అతని కుటుంబం ‘క్రీమీ లేయర్’ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ జిల్లా కుల, ఆదాయ ధృవీకరణ కమిటీ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది. అభ్యర్థి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని.. వారి వార్షిక ఆదాయం సుమారు రూ.19.48 లక్షలు ఉందని అధికారులు గుర్తించారు. దీంతో వారు క్రీమీ లేయర్లోకి వస్తారని కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించారు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
దీనిపై అభ్యర్థి కర్ణాటక హైకోర్టుకు వెళ్లాడు. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల నుంచి మినహాయించడాన్ని న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో బాధితుడు కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. “తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైతే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? విద్య, ఆర్థిక సాధికారతతో సామాజిక అభివృద్ధి వస్తుంది. అలాంటప్పుడు మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే మనం ఎప్పటికీ దాని నుంచి బయటకు రాలేం” అని వ్యాఖ్యానించారు. “రిజర్వేషన్ వల్ల తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. మంచి ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు వారి పిల్లలు కూడా అదే రిజర్వేషన్ కోరుతున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం” అని పేర్కొన్నారు.
అయితే అభ్యర్థి తరపు న్యాయవాది శశాంక్ రత్నూ వాదిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో క్రీమీ లేయర్ నిర్ణయానికి జీతం ఒక్కటే ప్రమాణం కాదన్నారు. తల్లిదండ్రులు గ్రూప్-A లేదా గ్రూప్-B సేవల్లో ఉన్నారా అన్నదే ప్రధాన ప్రమాణమని తెలిపారు. కేవలం జీతాన్ని ప్రమాణంగా తీసుకుంటే డ్రైవర్లు, క్లర్కులు, ప్యూన్లు కూడా రిజర్వేషన్ కోల్పోతారని వాదించారు. జీతం, వ్యవసాయ ఆదాయాన్ని క్రీమీ లేయర్ లెక్కల్లో పరిగణించరాదని.. వ్యాపారాలు లేదా ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూడాలని పేర్కొన్నారు. లేదంటే ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మధ్య తేడా లేకుండా పోతుందని తెలిపారు. అయితే అభ్యర్థి తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం తీవ్రంగా తోసిపుచ్చింది. ఇది కరెక్టే కాదని పేర్కొంది.
కర్ణాటక హైకోర్టు తీర్పు..
ఈ కేసులో కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే అభ్యర్థిపై వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కుటుంబ ఆదాయం పరిమితిని మించడంతో అభ్యర్థి క్రీమీ లేయర్లోకి వస్తాడని హైకోర్టు తేల్చింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా… రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొంది సామాజిక, ఆర్థిక సాధికారిత తర్వాత తమ కుటుంబంలోని తర్వాతి తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు పునః పరిశీలించుకోవాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!