Site icon NTV Telugu

Supreme Court: నేడు సుప్రీం కోర్టు ముందుకు హై ప్రొఫైల్ కేసులు..

Supreme Court

Supreme Court

Pegasus, PMLA, Bilkis Bano Among Big Cases Set For Hearing in supreme court Today: సుప్రీం కోర్టు ముందుకు నేడు కీలక కేసులు విచారణకు రానున్నాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న బిల్కిస్ బానో కేసు నుంచి తీస్తా సెతల్వాడ్ కేసు, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), పెగాసస్ స్పైవేర్ కేసు, ప్రధాన మంత్రి సెక్యూరిటీ లోపాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

దేశాన్ని కుదిపిన పెగాసస్ స్పైవేర్ కేసుపై సుప్రీం నేడు విచారించనుంది. పెగాసిస్ స్పై వేర్ ఉపయోగించి ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఇతరులు ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతంతో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. ప్రస్తుతం కమిటీ ఇచ్చే రిపోర్టుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ధర్మాసనం విచారించబోతోంది.

దీంతో పాటు ఇటీవల 2002 గుజరాత్ అల్లర్లలో సంచలనం రేపిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 11 మంది నిందితులను విడుదల చేసింది. ఈ విడుదలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ. అత్యాచారం, హత్యలకు పాల్పడి యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న వారిని.. అన్యాయంగా 5 నెలల గర్భిణిపై అత్యాచారం చేసిన వ్యక్తులను ఎలా వదిలిపెడతారంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీన్ని కూడా సుప్రీం కోర్టు నేడు విచారించనుంది.

Read Also: COVID 19: దేశంలో 10 వేలకు పైగా కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు

దీంతో పాటు 2002 గుజరాత్ అల్లర్లలో తప్పుడు సాక్ష్యాలు, సమాచారం ద్వారా అమాయకులను కేసులో ఇరికిద్ధాం అని ప్రయత్నించిన ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్ బెయిల్ అంశాన్ని కూడా సుప్రీం నేడు విచారించనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది.

దీంతో పాటు జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ ఫిరోజ్ పూర్ పర్యటన సమయంలో అప్పటి పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని వహించింది. ప్రధానికి కనీస భద్రను కూడా కల్పించడంలో, ప్రోటోకాల్ పాటించడంతో పంజాబ్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ కు అడ్డంగా ఆందోళకారులు నిలవడంతో ఓ ప్లైఓవర్ పై ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయింది. ఈ కేసును కూడా నేడు సుప్రీం కోర్టు విచారించబోతోంది.

Exit mobile version