Site icon NTV Telugu

Supreme Court : మిస్సింగ్ పిల్లల కోసం ప్రత్యేక చర్యలు అవసరం

Supreme Court

Supreme Court

Supreme Court : దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల కేసులపై పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురియా స్వయంసేవి సంస్థ (NGO) దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Siddhu Jonnalagadda : ఉమనైజరా అన్న జర్నలిస్ట్.. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌.. షాకింగ్ రియాక్షన్

మధ్యవర్తుల ద్వారా పిల్లలను ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు అక్రమంగా తరలించి, విక్రయిస్తున్న మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ గురించి సుప్రీం కోర్టు దృష్టికి ఎన్జీవో తీసుకువచ్చింది. కేసును జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతి రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతం కనిపించని పిల్లల పర్యవేక్షణకు బాధ్యుడైన నోడల్ అధికారిని నియమించాలి. పిల్లల మిస్సింగ్ కేసు ఏదైనా పోర్టల్‌లో నమోదయిన వెంటనే, ఆ సమాచారాన్ని నోడల్ అధికారులకు కూడా పంపాలి. వారు పిల్లల గుర్తింపు, నిందితుల విచారణ, కేసు నమోదు వంటి చర్యలు తీసుకోవాలి.

Trump: పాక్ ఆర్మీ చీఫ్‌పై ట్రంప్ ప్రశంసలు.. మోడీ గురించి ఏమన్నారంటే..

Exit mobile version