NTV Telugu Site icon

Supreme Court: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court

Supreme Court

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లపై పార్టీలు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందజేయడం వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాలు కారణంగా ఏ పనీ చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని తెలిపింది.
ఈ పథకాల ద్వారా లబ్దిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నారని జస్టిస్ బీఆర్. గవాయ్ వ్యాఖ్యానించారు.