Supreme Court: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటం తప్పే.. అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు తెలిపింది. కొత్త కార్మిక చట్టం ప్రకారం 12 గంటల పని, వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం, గంజాయి రవాణా, మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్టీ ఆధ్వర్యంలో గతంలో జరిగిన ఆందోళనలో.. సీవీ షణ్ముగం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు గుప్పించారు.
Read Also: Adani Group: అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..
ఇక, దీనిపై డీఎంకే నేతలు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జిల్లా న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. అదే సమయంలో కేసు రద్దు చేయాలని కోరుతూ సీవీ షణ్ముగం సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలు చేయగా.. దీనిపై అపెక్స్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ.. తన ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సెప్టెంబరు నెల 23న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును మంగళవారం జస్టిస్ సుదన్షు తులియా, జస్టిస్ అజానుద్దీన్ అమనుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
Read Also: Hemant Soren: ప్రధాని మోడీతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ.. సీఎం ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం..
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. ఈ కేసు అంశంలో జిల్లా కోర్టు విచారణపై విధించిన స్టే ఎందుకు తొలగించ కూడదు? అని అగిడింది. అలాగే, అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా?.. అందువల్ల ఈ కేసు విచారణను సీవీ షణ్ముగం ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొనింది. ఇక, తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.