Site icon NTV Telugu

Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆఫీసులకు సుప్రీం నోటీసులు

Supreme

Supreme

Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల దగ్గర పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పరిద్వాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర హోంశాఖతో పాటు గవర్నర్‌ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

Read Also: Kannepalli Pump House: ఆగస్టు 2 డెడ్‌లైన్‌.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం: కేటీఆర్‌

ఇక, రాష్ట్రపతికి పంపించాల్సిన బిల్లులపై ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్న గవర్నర్ల చర్యను సవాలు చేస్తూ.. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు ఫైల్ చేశాయి. ఏడాదికి పైగా ఎనిమిది బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని.. ఆలస్యానికి గల కారణం తెలియజేయట్లేదని రెండు రాష్ట్రాలూ తమ పిటిషన్‌లలో తెలిపాయి. దీంతో సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు నోటీసులు ఇచ్చింది.

Exit mobile version