Supreme court: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. ఎన్నికల సంఘానికి నోటీసులు
- ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్..
- ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని వినతి..
- కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme court: ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ లాయర్ సుప్రీంలో పిల్ ఫైల్ చేశారు. పొలిటికల్ పార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్ లో వెల్లడించారు.
Read Also: Bigg Boss 8: తారస్థాయికి చేరిన నామినేషన్ రచ్చ.. మరి ఈ వారం నామినేషన్ లోకి ఎవరొచ్చారంటే?
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
ఇక, ఈ ఉచిత హామీల వల్ల ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని బెంగళూరుకు చెందిన లాయర్ వేసిన పిటిషన్ లో వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే అంశంపై పెడింగ్‌లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు ఇచ్చింది. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ హన్సారియా ఉచిత హామీల అంశంపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. అదే విధంగా ఎన్నికల ముందు ఇచ్చే ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావితం చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని కోర్టులో న్యాయవాది పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!