Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ పై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (జనవరి 20) ప్రకటించింది. ఇక, రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ కార్యకర్త నవీన్ ఝా దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టివేసింది.
Read Also: Dwaraka Tirumala Rao: పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు: ఏపీ డీజీపీ
మరోవైపు, జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇక, రాహుల్ గాంధీ తరఫు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. బాధిత వ్యక్తి మాత్రమే క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేయగలరని.. ప్రాక్సీ పార్టీ ద్వారా ఫిర్యాదు చేయలేమని అనేక తీర్పులను ఇప్పటికే న్యాయస్థానాలు వెల్లడించాయని తెలిపారు. అభిషేక్ సింఘ్వీ ప్రకటనపై స్పందించేందుకు బీజేపీ కార్యకర్త, ఫిర్యాదుదారు నవీన్ ఝా, జార్ఖండ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.